Woman Police threatened: విచారణకు వెళ్లిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను కత్తిపీటతో బెదిరించాడు పెరుమాళ్ వ్యక్తి. తమిళనాడు మదురైకు చెందిన పెరుమాళ్.. వారితో అసభ్యంగా మాట్లాడాడు.
భార్య ఫిర్యాదుతో.. విచారణకు వెళితే..
సెల్లూర్ మీనాంబాల్‌పురంలో నివాసముంటున్న పెరుమాళ్.. అతని భార్య మధ్య కొద్ది రోజల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై తల్లాకుళంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో పెరుమాళ్ భార్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని విచారించడానికి మహిళా పోలీసులు సంగీత, పొన్నుతై వెళ్లారు. వారిని చూసి కోపం పెంచుకున్న పెరుమాళ్.. ఇంటిలో ఉన్న కత్తిపీటను పట్టుకుని గేటు వద్దకు వచ్చాడు. పోలీసులను బెదిరించి.. అసభ్యంగా మాట్లాడాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.