ఐఈడీ పేలుడు- ముగ్గురు జవాన్లు మృతి - ఐఈడీ పేలుడు ఝార్ఖండ్
ఐఈడీ పేలుడు
10:23 March 04
ఐఈడీ పేలుడు- ముగ్గురు జవాన్లు మృతి
ఝార్ఖండ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. చాయీబాసా ప్రాంతంలో జరిపిన ఐఈడీ పేలుడులో తొలుత ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
టోక్లో పోలీస్ స్టేషన్ పరిధిలోని లాంజీ అటవీ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
Last Updated : Mar 4, 2021, 1:11 PM IST