తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌.. అదే కారణమా? - పచ్చబొట్టు

సరదాగా వేయించుకున్న టాటూలు వారికి ప్రాణాల మీదకు తెచ్చాయి. ఓ ఇద్దరికి టాటూల వల్ల హెచ్​ఐవీ సోకింది. అంతేకాదు మరో 12 మంది కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

tattoo
టాటూ

By

Published : Aug 7, 2022, 6:04 AM IST

Updated : Aug 7, 2022, 7:02 AM IST

టాటూలు వేసుకున్న ఇద్దరు అత్యంత ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు. పచ్చబొట్లు వేసుకున్న ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో వెలుగుచూసింది. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రి వైద్యురాలు ప్రీతి అగర్వాల్ వివరాల ప్రకారం.. వారణాసికి చెందిన 14 మంది అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. కాగా వారికి జ్వరం లక్షణాలు ఉండగా.. టైఫాయిడ్, మలేరియాతోపాటు పలు పరీక్షలు నిర్వహించారు. అయినా ఫలితం తేలలేదు. జ్వరం తగ్గకపోవడంతో అనుమానంతో వారికి హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా.. 20 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతికి పాజిటివ్‌గా తేలింది.

అయితే, హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులతో శారీరకంగా వారు కలవలేదని, వారి రక్తం ద్వారా కూడా ఈ వ్యాధి సోకలేదని తేలింది. అయితే ఈ 14మంది కూడా ఈమధ్యే టాటూలు వేసుకున్నట్లు గుర్తించారు. ఓ సెంటర్‌లో వీరంతా టాటూలు వేసుకోగా.. వారికి ఒకే సూదితో ఈ పచ్చబొట్లు వేసినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టాటూలు వేసే సూదుల ధరలు అధికంగా ఉన్న కారణంగా డబ్బు ఆదా చేసుకునేందుకు కొన్ని షాపుల్లో ఇలా ఒకే సూదితో టాటూలు వేస్తున్నట్లు వైద్యురాలు ప్రీతి అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. సూది కొత్తదో, పాతదో నిర్ధరించుకున్న తర్వాతే పచ్చబొట్టు వేసుకోవాలని ఆమె సూచించారు.

ఇదీ చూడండి :పోలీస్​స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి.. కానిస్టేబుల్‌పై మూక దాడి.. ఏం జరిగింది?

Last Updated : Aug 7, 2022, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details