తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భవనం 42వ అంతస్తు నుంచి కిందపడ్డ రాయి.. అక్కడికక్కడే ఇద్దరు మృతి - Two people died after a big stone

నిర్మాణంలో ఉన్న బిల్డింగ్​ పైనుంచి పెద్ద రాయి పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిందీ ఘటన. మరోవైపు, అసోంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు దుండగులు.

Two people died after a large brick fell from under construction building in Worli
Two people died after a large brick fell from under construction building in Worli

By

Published : Feb 15, 2023, 9:31 AM IST

Updated : Feb 15, 2023, 9:49 AM IST

మహారాష్ట్రలోని ముంబయిలో విషాదకర ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ పెద్ద భవనం పై నుంచి బండ రాయి పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ముంబయిలోనివర్లీ ప్రాంతంలో ఓ భారీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 9.40 ప్రాంతంలో 42వ అంతస్తు నుంచి ఓ పెద్ద రాయి.. ఒక్కసారిగా కింద పడింది.

ఆ సమయంలో అటు వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై ఆ రాయి పడింది. దీంతో వారిద్దరూ మరణించారు. ఘటనాస్థలిలో ఉన్న అనేక కార్లపై కూడా రాళ్లు పడ్డాయి. అద్దాలపై రాళ్లు పడటం వల్ల కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను సబిర్​ అలీ, ఇమ్రాన్​ అలీఖాన్​గా పోలీసులు గుర్తించారు.

ధ్వంసమైన కారు
ధ్వంసమైన కారు

ఆరేళ్ల ​పై హత్యాచారం..
అసోంలోని సోనిత్​పుర్​ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. టీ తోటలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత బాలికను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంటనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Last Updated : Feb 15, 2023, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details