తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో పాక్ చొరబాటుదారుల​ హతం - సరిహద్దు భద్రతా దళం

పంజాబ్​లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇద్దరు పాక్​ చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) అంతమొందించింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Pakistani intruders
పాకిస్థానీ చొరబాటుదారులు

By

Published : Jul 31, 2021, 12:23 PM IST

ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) మట్టుబెట్టింది. పంజాబ్​లోని తర్న్​ తరణ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ ఘటన జరిగిందని ఓ అధికారి శనివారం తెలిపారు.

శుక్రవారం రాత్రి 8.48 గంటలకు సరిహద్దు వెంబడి అనుమానిత వ్యక్తుల కదలికలను భద్రతా సిబ్బంది గుర్తించారని సదరు అధికారి తెలిపారు. వారిని ఆగాలని పదేపదే హెచ్చరించినప్పటికీ.. వినిపించుకోలేదని చెప్పారు. దాంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు వాటిల్లకుండా ఉండేందుకు వారిపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. అయితే.... వారు ఉగ్రవాదులా కాదా అన్న విషయాన్ని సైన్యం వెల్లడించలేదు.

ABOUT THE AUTHOR

...view details