తెలంగాణ

telangana

ETV Bharat / bharat

11ఏళ్ల బాలికపై పలుమార్లు రేప్.. మైనర్లే నిందితులు.. ఫోన్​లో వీడియో తీసి.. - bhilai fashion designer suicide

11ఏళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ దారుణాన్ని ఫోన్లలో బంధించారు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరోవైపు, ఛత్తీస్​గఢ్​లో ఓ యువ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకుంది.

tripura minors rape
tripura minors rape

By

Published : May 30, 2023, 7:13 AM IST

త్రిపురలో 11 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని నిందితులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం తెల్లవారుజామున ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర త్రిపుర జిల్లా, ధర్మనగర్ సబ్​డివిజనల్ పరిధిలోని కదంతలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసు వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ దారుణం జరిగింది. బాలిక తల్లి పని కోసం బయటకు వెళ్లిన సమయంలో నిందితులు.. చిన్నారిపై అత్యాచారానికి తెగబడ్డారు. బాలిక ఒంటరిగా ఉండటాన్ని చూసి పలుమార్లు రేప్ చేశారు. ఈ దారుణానికి తెగబడుతూ.. ఫోన్​లో చిత్రీకరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. తల్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని బాలిక వివరించింది. దీంతో బాలిక తల్లి.. ధర్మనగర్ పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించింది.

సమాచారం అందిన వెంటనే.. పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ సుబీర్ మలకార్ ఘటనాస్థలానికి వెళ్లారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు. పోక్సో చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నిందితుల కోసం వెతికారు. సోమవారం ఉదయం రాజేంద్ర నగర్ ప్రాంతంలోని మంద్రాజీ పారా కాలనీలో నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇద్దరికీ 16 ఏళ్ల వయసు ఉంటుందని చెప్పారు. బాధితురాలి తండ్రి కొద్దిరోజులుగా కనిపించకుండా పోయాడని పోలీసులు వివరించారు. దీంతో బాలిక తల్లి.. పని కోసం వెతుకుతున్నారని చెప్పారు.

ఫ్యాషన్ డిజైనర్ సూసైడ్
ఛత్తీస్​గఢ్​లోని భిలాయ్​లో యువ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకుంది. బీ.కామ్ పైనల్ ఇయర్ చదువుతున్న ఆకాంక్ష అహిర్వార్(23).. తన ఇంట్లో విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి మృతికి కారణాలు తెలియలేదు. అయితే, ఓ యువకుడి వేధింపులకు తట్టుకోలేకే ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

తల్లి, ముగ్గురు తోబుట్టువులతో ఆకాంక్ష నివాసం ఉంటోందని పోలీసులు తెలిపారు. ఇద్దరు చెల్లెళ్లలో ఒకరు పన్నెండో తరగతి పాస్ కాగా.. మరోకరు పది పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. సోదరుడు సాహిల్.. హోటల్​లో పనిచేస్తున్నాడని చెప్పారు. ఆకాంక్ష తండ్రి గతంలో పోలీసుగా పనిచేసేవాడని, ఓ హత్య కేసులో గత 20 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నాడని వెల్లడించారు. ఆకాంక్ష తల్లి మన్​కున్వార్ అహిర్వార్.. వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.

"సెక్టార్ 4లో వీరంతా నివాసం ఉంటున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆకాంక్ష మృతదేహం తన గదిలో కనిపించింది. సమాచారం అందుకొని ఘటనాస్థలికి చేరుకున్నాం. మృతదేహానికి పంచనామా నిర్వహించాం. అనంతరం పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం" అని పోలీసులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details