ఛత్తీస్గఢ్లో రాజనాంద్ గావ్ జిల్లాలో ఘోరం జరిగింది. మైనర్ అక్కాచెల్లెలు కలిసి తండ్రిని గొడ్డలితో నరికి చంపారు. జిల్లాలోని బెలరగొండి గ్రామంలో సహదేవ్ నేతమ్ (45) తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. వారికి 14,16 ఏళ్ల వయసున్న ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సహదేవ్ ఇటీవల మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం తాగివచ్చి భార్య, పిల్లలను వేధించసాగాడు.
గొడ్డలితో నరికి..
మంగళవారం రాత్రి కూడా తాగి వచ్చి భార్యని హింసించటం మొదలుపెట్టాడు సహదేవ్. ఇంట్లో ఉన్న గొడ్డలితో బెదిరించాడు. ఆ క్రమంలో అక్కడే ఉన్న ఇద్దరు ఆడ పిల్లలు తల్లిని కొట్టకుండా అడ్డుపడ్డారు. తండ్రి చేతిలోని గొడ్డలిని లాక్కున్నారు. తండ్రిపై కోపంతో దాడి చేశారు. గొడ్డలితో నరికి చంపారు.