Nagpur minor rape: 13 ఏళ్ల మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు 62 ఏళ్ల వృద్ధుడు. నిందితుడు.. బాధితురాలికి స్వయానా తాత. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లోని కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడి కూతురు ప్రసవం కోసం అతడి ఇంటికి వచ్చింది. ఆమె కుమార్తె 13 ఏళ్ల బాలిక సైతం తల్లితో పాటు ఉంటోంది. బాధితురాలు తన తాత వద్ద నిద్రపోయింది. ఆ సమయంలో నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి కుటుంబ సభ్యులు.. బాధితురాలి తల్లికి ఈ విషయం బయటకు తెలియనివ్వొద్దని హెచ్చరించారు. తన తండ్రి చేసిన తప్పును ఎవరికీ చెప్పొద్దని బాధితురాలి తల్లితో వారించారు. మొదట్లో భయపడిన ఆమె.. ఆ తరువాత కపిల్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
మాయమాటలు చెప్పి:మరోవైపు, 12 ఏళ్ల మైనర్‌పై 24 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని జరీపట్కా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు నీలేశ్ లింబడే.. బాధితురాలి ఇంటి పక్కనే ఉంటున్నాడు. మైనర్‌తో పరిచయం పెంచుకుని దగ్గరయ్యాడు. ఎవరూ లేని సమయంలో బాధితురాలిని తన ఇంటికి ఆహ్వానించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. జరిగిన విషయమంతా బాధితురాలు ఆమె తల్లిదండ్రులకు చెప్పగా.. కుటుంబ సభ్యులు జరీపట్కా పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. నీలేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కుమారుని కుటుంబం పైనే పెట్రోల్ పోసి: కుమారుడి కుటుంబంపైనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. క్షతగాత్రుల్ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు గ్రామస్థులు. ఈ ఘటనపై తాజ్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కన్హయ్య ఆగ్రా సమీపంలోని తోరా గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు మద్యం సేవించి.. కుమారుడు సందీప్, కోడలు అర్చనతో గొడవలు పడేవాడు. ఆదివారం రాత్రి కూడా బాగా తాగి కోడలితో గొడవకు దిగాడు. అనంతరం కన్హయ్య తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని డాబా మీద పడుకోమన్నాడు.