తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మైనర్లపై గ్యాంగ్​ రేప్​ - ఎంపీ రేపు ఇన్సిడెంట్స్​

రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మైనర్లపై గ్యాంగ్ రేప్​ జరిగింది. వారిలో ఒకరి వయసు 17 ఏళ్లు.. మరొకరిది 12 సంవత్సరాలుగా అధికారులు గుర్తించారు.

Two minor girls gang-raped in separate incidents in MP
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మైనర్లపై గ్యాంగ్​ రేప్​

By

Published : Nov 10, 2021, 6:56 AM IST

మధ్యప్రదేశ్​లోని రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్​ జరిగింది.

రైసెన్​లో 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై ఓ మైనర్​తో సహా ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

నిద్రిస్తుండగా..

మరో ఘటనలో ఖాండ్వా జిల్లాలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలికను అపహరించిన ముగ్గురు వ్యక్తులు.. అనంతరం అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలు.. తన బంధువుల ఇంట్లో నిద్రిస్తుండగా అపహరించారు దుండగులు. బాలిక కనిపించట్లేదని గుర్తించిన కుటుంబసభ్యులు.. వెతకగా ఇంటి సమీపంలోనే గాయాలతో పడిఉంది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ రెండు కేసులతో సంబంధం ఉన్న మొత్తం ఐదుగురిలో ఇప్పటివరకు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం​ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:కూతురికి స్కూటీ కొనిచ్చాడని.. భర్తను చంపేసిన రెండో భార్య

ABOUT THE AUTHOR

...view details