జమ్ముకశ్మీర్లో భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. శ్రీనగర్, దక్షిణ కశ్మీర్లోని(Jammu Encounter News) రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
తొలుత కుల్గాం జిల్లా చవల్‌గామ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చేపట్టగా.. ముష్కరులు కాల్పులు జరిపారు. వారి కాల్పులను తిప్పికొట్టిన సైన్యం ఓ ఉగ్రవాదిని హతమార్చింది.