తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇద్దరు లష్కరే తోయిబా అనుచరులు అరెస్ట్​ - లష్కరే తోయిబా

జమ్ముకశ్మీర్​ బారముల్లా జిల్లాలో లష్కర్​-ఏ-తోయిబా(ఎల్​ఈటీ)ముఠా కోసం పనిచేసే ఇద్దరు అనుచరులను పోలీసులు అరెస్ట్​ చేశారు. గ్రెనేడ్​ దాడి కేసులో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Militant associates arrest
లష్కరే తోయిబా అనుచరులు అరెస్ట్​

By

Published : Apr 4, 2021, 5:12 AM IST

లష్కర్​-ఏ-తోయిబా(ఎల్​ఈటీ) ముఠా కోసం పనిచేసే ఇద్దరు అనుచరులను కశ్మీర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. గ్రెనేడ్​ దాడి కేసుకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన బలగాలు.. బారముల్లా జిల్లా సోపోర్​ ప్రాంతంలో ఇరువురిని పట్టుకున్నాయి.

2020, డిసెంబర్​ 12న సోపోర్​ ప్రాంతంలోని పోలీస్​ పోస్ట్​ బస్టాండ్​ గేట్​ వద్ద గ్రెనేడ్​ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన కశ్మీర్​ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కేసుతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న నూర్​ బాఘ్​ సోపోర్​కు చెందిన మోహమ్మద్​ అసిఫ్​ నజర్​, గ్రీన్​టౌన్​ సోపోర్​కు చెందిన సాహిల్​ రషీద్​ భట్​లను అరెస్ట్​ చేశారు.

వారిని ప్రశ్నించగా.. లష్కర్​-ఏ-తోయిబా కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఎల్​ఈటీ ఉగ్రవాదుల సూచనల మేరకే పోలీసు పోస్ట్​ వద్ద గ్రెనేడ్​ దాడి చేసినట్లు వెల్లడించారని చెప్పారు. మిలిటెంట్​ ర్యాంక్​లో చేరాలనుకుంటున్నట్లూ తెలిపారని, పోలీస్​, భద్రతా బలగాలపై దాడి చేయాలని గ్రెనేడ్లు తమకు అందాయని ఒప్పుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:'లష్కరే ముస్తఫా' చీఫ్ హిదాయతుల్లా అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details