తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమ పొలంలోకి నీళ్లు రానివ్వొద్దన్నందుకు కాల్పులు- ఇద్దరు మృతి - ఆగ్రా హత్యలు

పంట భూమిలోకి నీరు తరలించే అంశంపై చెలరేగిన వివాదం ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను బలిగొంది. ఈసంఘటన ఉత్తర్​ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. నిందితులు పరారీలో ఉన్నారు.

Two men shot dead in UP's Agra
హత్య

By

Published : Dec 17, 2021, 11:49 AM IST

వ్యవసాయ భూములు, గెట్ల పంచాయతీలు ఒక్కోసారి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లిన ఘటనలు చాలా చూశాం. అలాంటిదే ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో జరిగింది. మా భూమిలోకి నీళ్లు రానివ్వొద్దని ప్రశ్నించినందుకు కాల్పులు జరిపింది ఓ కుటుంబం. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆగ్రా.. ఖేదా రాథోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపుర గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మృతులను మహేష్, దినేశ్​గా గుర్తించారు పోలీసులు.

"గ్రామానికి చెందిన కల్యాణ్ సింగ్ అనే వ్యక్తి పొలం నుంచి తమ భూమిలోకి నీరు వస్తుండడాన్ని బాధితులు తప్పుపట్టారు. ఆ నీటిని మళ్లించాలని పలుమార్లు కోరినప్పటికీ సింగ్ కుటుంబం స్పందించలేదు. అయితే.. రెండు కుటుంబాల మధ్య వివాదమేమీ లేదు. గతంలో కొన్ని గొడవలు ఉన్నప్పటికీ అవి పరిష్కారమయ్యాయి. ప్రస్తుతం నిందితులు ఇంటి నుంచి పారిపోయారు. వారికోసం గాలిస్తున్నాం"

-- ­సుధీర్ కుమార్ సింగ్, సీనియర్ ఎస్పీ

ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీనియర్ ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details