కేరళ తిరువనంతపురంలోని బలరాంపురలో ఓ వ్యక్తి.. వాహనాలను ధ్వంసం చేసే పనిలో పడ్డాడు. మరో వ్యక్తి సహాయంతో.. ఇప్పటివరకు సుమారు 12కుపైగా వాహనాలను ధ్వంసం చేశాడు. డ్రగ్స్‌కు బానిసైన మిథున్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడే దాడులకు పాల్పడుతున్నట్టు తెలిపారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు స్పష్టం చేశారు.
నిందితులు.. బలరాంపురం, ఎరుత్తవుర్, రూస్సెల్పురంల్లో పార్క్ చేసి ఉంచిన తొమ్మిది లారీలు, మూడు కార్లు, నాలుగు బైక్‌ల అద్దాలను పగల గొట్టినట్లు పోలీసులు తెలిపారు.