తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదులను పట్టుకున్న కశ్మీరీలు.. పోలీసులకు అప్పగింత.. గవర్నర్ భారీ నజరానా - గ్రామస్థులకు దొరికిపోయిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్​లో.. లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. గ్రామస్థుల ధైర్య సాహసాలు మెచ్చి రాష్ట్ర లెఫ్టినెంట్​ గవర్నర్​​, డీజీపీ భారీ నజరానా ప్రకటించారు.

two let militants arrest
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్థులు

By

Published : Jul 3, 2022, 12:16 PM IST

Updated : Jul 3, 2022, 12:40 PM IST

జమ్ముకశ్మీర్​లోని రియాసీ జిల్లాలో లష్కరే తోయిబా చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను తుక్సన్ గ్రామస్థులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇటీవల జరిగిన పేలుళ్లలో ముఖ్య సూత్రదారి అయిన తాలిబ్​ హుస్సేన్, దక్షిణ కశ్మీర్​లోని పుల్వామాకు చెందిన ఫైజల్ అహ్మద్​ను గ్రామస్థులు నిర్బంధించారు. వారి నుంచి రెండు తుపాకులు, ఏడు గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్థులు
ముష్కరులను పోలీసులకు అప్పగించిన తుక్సన్ గ్రామస్థులు

గ్రామస్థుల ధైర్యసాహాసాలను మెచ్చిన కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్​(డీజీపీ) దిల్బాగ్​ సింగ్ రూ.2 లక్షలను నజరానాగా ప్రకటించారు. మరోవైపు, ఇద్దరు ముష్కరులను పట్టుకున్న తుక్సన్ గ్రామస్థులకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్​ సిన్హా రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

ఉగ్రవాదుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Last Updated : Jul 3, 2022, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details