యూపీలో అకాల వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. చిత్రకూట్‌లోని మాణిక్‌పుర్ ప్రాంతంలో పిడుగుపాటుతో ఆదివారం ఇద్దరు మృతిచెందారని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది.
పిడుగుపాటుతో ఇద్దరు మృతి- సీఎం దిగ్భ్రాంతి - తాజా పిడుగుపాటు ఘటనలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో పిడుగుపాటు కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.
![పిడుగుపాటుతో ఇద్దరు మృతి- సీఎం దిగ్భ్రాంతి Lightning strike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11621138-thumbnail-3x2-lightning.jpg)
పిడుగుపాటు
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు పరిహారం అందించడం సహా.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేశారు.