తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్రిపుర హింసపై ట్వీట్లు.. ఇద్దరు మహిళా జర్నలిస్టుల నిర్బంధం

త్రిపుర హింసపై(tripura violence) ట్వీట్లు చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అసోం పోలీసులు నిర్బంధించారు. ఈ అరెస్టును ఎడిటర్స్‌ గిల్డ్‌ ఖండించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు.

tripura
త్రిపుర

By

Published : Nov 15, 2021, 5:38 AM IST

త్రిపురలో ఇటీవల చోటుచేసుకున్న హింసపై(tripura violence) కవరేజీ ఇచ్చి ట్వీట్లు చేసిన ఓ మీడియా ఛానల్‌కు చెందిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అసోం పోలీసులు నిర్బంధించారు. తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారా వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ విశ్వహిందూ పరిషత్‌.. వారిపై రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది.

నోటీసులు అందజేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసులు తమను అనధికారికంగా నిర్బంధించారని సమృద్ధీ సకూనియా, స్వర్ణ ఝా జర్నలిస్టులు ట్విట్టర్‌లో ద్వారా తెలిపారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను వీరిద్దరూ సందర్శించారని, లేనిపోని విషయాలతో వర్గాల మధ్య శతృత్వం పెంచేలా ట్వీట్లు చేశారని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై తమముందు హాజరై విచారణ ఇవ్వాలని కోరినా స్పందించకుండా రాష్ట్రం వదిలి వెళ్లారని పోలీసులు చెప్పారు.

కాగా, జర్నలిస్టుల అరెస్టును ఎడిటర్స్‌ గిల్డ్‌ ఖండించింది. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మహిళా జర్నలిస్టుల అరెస్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. జర్నలిజాన్ని అణచివేయడంలో భాజపా వ్యవస్థలన్ని నిమగ్నమయ్యాయని ఆరోపించారు. కానీ అబద్ధాలతో అసలు నిజాలను ఎప్పడూ దాచలేరని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. త్రిపురలో హింసపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులు సహా 71 మందిపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

Amaravati news: 'మహా' అమరావతిలో కర్ఫ్యూ.. ఇంటర్నెట్​ బంద్​

ABOUT THE AUTHOR

...view details