దిల్లీలో 125.84 కిలోల హెరాయిన్‌ను అక్రమంగా సరఫరా చేస్తున్న ఇద్దరు అఫ్గాన్ శరణార్థులను ఏఏటీఎస్ పోలీసులు.. శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి కారును సీజ్ చేశారు. హెరాయిన్ విలువ రూ. 860 కోట్లు ఉంటుందని అంచనా.
రూ. 860 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత! - Afghan refugees, were arrested by an anti-auto-theft-squad (AATS)
హెరాయిన్ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేశారు దిల్లీ పోలీసులు. రూ. 860 కోట్ల విలువైన హెరాయిన్‌ను అక్రమంగా సరఫరా చేస్తున్న ఇద్దరు అఫ్గాన్ శరణార్థులను శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితులను ఐదురోజులు పోలీస్ కస్టడీకి తరలించారు.
హెరాయిన్ పట్టివేత
నిందితులను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తరలించినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి :కేరళలో 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం