తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళను కారులో తీసుకెళ్లి గ్యాంగ్​రేప్​- నిందితుల అరెస్ట్​ - దిల్లీలో మహిళపై లైంగిక దాడి

Gangrape news: గ్యాంగ్​రేప్​ ఆరోపణలతో దిల్లీ పోలీసులు ఇద్దరిని అరెస్ట్​ చేశారు. ఒంటరిగా ఉన్న మహిళను వాహనంలో ఎక్కించుకుని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

gang rape
గ్యాంగ్​ రేప్​

By

Published : Dec 29, 2021, 10:02 AM IST

Updated : Dec 29, 2021, 10:53 AM IST

Gangrape news: దిల్లీలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని హరి నగర్​లో మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులకు పీసీఆర్​ కాల్​ వచ్చిందని తెలిపారు. దీంతో ఓ బృందాన్ని ఘటనా స్థలానికి పంపినట్లు పేర్కొన్నారు. అప్పటికే ఆమె లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పిందని అధికారులు తెలిపారు. నిందితులు తనను కారులో ఎక్కడి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారనే విషయం సదరు మహిళ స్పష్టంగా చెప్పనట్లు పేర్కొన్నారు.

పలు సాంకేతిక అంశాల ఆధారంగా దర్యాప్తు చేయగా.. నిందితులను పట్టుకున్నట్లు వివరించారు. ఇద్దరు నిందితుల్లో ఒకరికి సోమవారమే 18 ఏళ్లు నిండాయని అన్నారు. వీరిలో ఒక వ్యక్తికి నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు.

దిల్లీలోని సాగర్​పుర్​ ప్రాంతంలో మహిళ ఒంటరిగా నిలబడి ఉండడం గమనించిన ఆ ఇద్దరు.. లిఫ్ట్​ ఇస్తామని వాహనంలో ఎక్కించుకుని నిహాల్​ విహార్​లో ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు స్పష్టం చేశారు. బాధితురాలిని కూడా అక్కడే వదిలి పరారయ్యారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:Bachpan Ka Pyar Boy: 'బచ్‌పన్‌ కా ప్యార్‌' బాలుడికి తీవ్రగాయాలు

Last Updated : Dec 29, 2021, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details