Two girls love: బిహార్లో ఇద్దరు యువతులు ప్రేమించుకుని.. వారి బంధానికి తల్లిదండ్రులు అడ్డు చెప్పారని పోలీసులను ఆశ్రయించిన ఉదంతం మరువక ముందే ఇటువంటిదే మరొక ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. ఆ రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ప్రేమలో మునిగి తేలుతున్న ఇద్దరు యువతులు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పెద్దలు ఒప్పుకోలేదని ఇంటి నుంచి పారిపోయారు.
ఇదీ జరిగింది.. పావగడ ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువతి తుమకూరులోని ఓ కళాశాలలో డిప్లొమా కోర్సు చేస్తోంది. అదే కాలేజీలో తుమకూరుకు చెందిన మరో యువతితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించారు. కానీ ఈ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించారు.