తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాయ్​ఫ్రెండ్​ కోసం యువతుల రచ్చ.. నడి రోడ్డు మీదే..! - బాయ్​ఫ్రెండ్​ కోసం యువతుల ఫైట్​

బాయ్​ఫ్రెండ్​ కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డు మీదే బాహాబాహీకి దిగారు. ఝార్ఖండ్​లోని సరాయకేలాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​ అయింది.

two girls fight for boyfriend
బాయ్​ఫ్రెండ్​ కోసం యువతుల రచ్చ.. నడి రోడ్డు మీదే..!

By

Published : Aug 12, 2021, 7:01 PM IST

Updated : Aug 12, 2021, 7:45 PM IST

బాయ్​ఫ్రెండ్​ కోసం యువతుల ఫైట్​

సాధారణంగా అమ్మాయిల కోసం కుర్రాళ్లు గొడవకి దిగుతుంటారు. కానీ అందుకు భిన్నంగా బాయ్​ఫ్రెండ్​ కోసం ఇద్దరు యువతులు కొట్టుకున్నారు. నడి రోడ్డు మీదే బాహాబాహీకి దిగి కొద్ది క్షణాలు అక్కడ గందరగోళం సృష్టించారు. వారికి సర్దిచెప్పేందుకు ఓ యువకుడు మరో యువతి ప్రయత్నించారు. అతి కష్టం మీద వారిని విడదీశారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని సరాయకేలా ఛాండిల్​ బజార్​లో బుధవారం సాయంత్రం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.

ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి యువతులు పరారయ్యారు. ఆ అమ్మాయిలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. యువతులు అదే ప్రాంతానికి చెందిన వారై ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి :యూట్యూబ్​ చూసి హెలికాప్టర్ తయారీ- టెస్ట్ చేస్తూ మృతి

Last Updated : Aug 12, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details