బ్యాంక్ నుంచి పొరపాటున ఇద్దరు యువకుల అకౌంట్లకు రూ.2.44 కోట్లు జమ అయ్యాయి. అయితే, ఈ డబ్బును యువకులు విలాసవంతంగా ఖర్చు చేశారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో జరిగింది. ఈ కేసులో అరింబూర్కు నిధిన్, మను అనే ఇద్దరు నిందితులను త్రిస్సూర్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఈ డబ్బులతో ఖరీదైన ఫోన్లు, వస్తువులను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొంత డబ్బును లోన్లు కట్టేందుకు, షేర్ మార్కెట్లో మదుపు చేసేందుకు ఉపయోగించారని పేర్కొన్నారు. తమ అకౌంట్లో మిగిలిన మొత్తాన్ని 19 వేర్వేరు బ్యాంకుల్లోని 54 ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పొరపాటున బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2కోట్లు.. విలాసాలకు ఖర్చు చేసిన యువకులు.. ఆఖరికి.. - కేరళ త్రిస్సూర్ క్రైమ్ న్యూస్
పొరపాటున తమ అకౌంట్లో పడిన రూ.2.44 కోట్లను ఖర్చు చేశారు ఇద్దరు యువకులు. ఈ ఘటన కేరళలో జరిగింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Etv Bharat
బ్యాంక్ నుంచి డబ్బులు వేరే అకౌంట్లోకి వెళ్లాయని గుర్తించిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులకు అకౌంట్ ఉన్న బ్యాంక్ మరో బ్యాంక్‌లో విలీనం కావడం వల్ల.. సర్వర్ సమస్య వల్ల డబ్బులు వారి అకౌంట్లోకి పడినట్లు గుర్తించారు. నిందితులు.. బ్యాంకు సర్వర్‌లను తారుమారు చేసి డబ్బులు స్వాహా చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.