వరలక్ష్మీ వ్రతం (ఆగస్టు 20).. సందర్భంగా తమిళనాడు చెన్నైలోని కుంద్రాతుర్ మురుగన్ ఆలయంలో వివాహం చేసుకునేందుకు పెద్ద ఎత్తున వధూవరులు, బంధువులు వచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా.. దాదాపు 30 పెళ్లి జంటలు ఆలయంలోకి ప్రవేశించాయి. ముందు తమకంటే.. తమకు వివాహం జరిపించాలన్నారు. దీంతో ఆలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పెళ్లిళ్లకు భారీ డిమాండ్.. ఎగబడ్డ జంటలు - పెళ్లికోసం ఎగబడ్డ జంటలు
ముందు తమకంటే.. తమకు ముందు వివాహం జరిపించాలని రెండు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. పెళ్లిళ్లకు డిమాండ్‌తో.. ఆలయానికి జంటలు భారీగా తరలివచ్చాయి. దీంతో ఆలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పెళ్లి గోల
ఓ రెండు కుటుంబాలు ఆలయంలోనే ఘర్షణకు దిగాయి. వెంటనే ఓ పోలీస్ అధికారి.. ఆలయంలోకి ప్రవేశించటంతో గొడవ సద్దుమణిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఇదీ చదవండి:Onam 2021: ఘనంగా ఓనమ్.. ప్రధాని, రాష్ట్రపతి శుభాకాంక్షలు