మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడి ఓ మహిళ బంగారు గొలుసును చోరీ చేశారు ఇద్దరు వ్యక్తులు. అనంతరం ఆమెను దారుణంగా కత్తితో పొడిచారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంబయిలోని ఓ ఫ్లాట్లో బాధితురాలు(59) ఒంటరిగా ఉంటోంది. శుక్రవారం సాయంత్రం.. ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటి తలుపు తట్టారు. తాము వైఫై టెక్నీషియన్లమని చెప్పి ఇంట్లోకి చొరబడ్డారు.
వైఫై రిపేర్ కోసమని ఇంట్లోకి చొరబడి గోల్డ్ చైన్ చోరీ.. కత్తితో పొడిచి పరార్ - ముంబయి వార్తలు
వైఫై టెక్నీషియన్లమని చెప్పి ఇంట్లోకి చొరబడి ఓ మహిళ బంగారు గొలుసు చోరీ చేశారు ఇద్దరు వ్యక్తులు. అనంతరం ఆమెను దారుణంగా కత్తితో పొడిచారు. ముంబయిలో జరిగిందీ ఘటన. మరోవైపు, మైనర్పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం ఆమెను తాళ్లతో బంధించారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపేశారు. ఆ తర్వాత అల్మారా తాళాన్ని అడగ్గా.. ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. వెంటనే వారిద్దరులో ఒకడు.. వంటగదిలో ఉన్న కత్తిని తెచ్చి ఆమె ఛాతిపై పొడిచాడు. అనంతరం ఇద్దరు దుండగులు పరారయ్యారు. బాధితురాలు అరుపులు విన్న స్థానికులు.. అప్రమత్తమయ్యారు. ఆమె భర్తకు విషయాన్ని తెలియజేసి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
మైనర్పై మామ, బావ అత్యాచారం..
ముంబయిలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మైనర్పై పలుమార్లు ఆమె మేనమామ, బావ అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకరాం..14 ఏళ్ల బాధితురాలు.. కొన్ని నెలలుగా బోరివలి ప్రాంతంలోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. ఇదే అదునుగా తీసుకున్న ఆమె మేనమామ, అతడి కుమారుడు అనేక సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధిత బాలిక.. మరో బంధువుకు తెలిపింది. అతడి ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు గంటల్లోనే నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.