తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెప్టిక్​ ట్యాంక్​ క్లీన్​ చేస్తుండగా విషాదం.. ఊపిరి ఆడక ముగ్గురు కార్మికులు మృతి! - సెప్టిక్​ ట్యాంక్​లో కార్మికులు మృతి

సెప్టిక్​ ట్యాంక్ క్లీన్​ చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది. అయితే ఊపరి ఆడకపోవడం వల్లే కార్మికులు చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

maharastra latest news
workers died in septic tank

By

Published : Oct 21, 2022, 11:08 AM IST

మహారాష్ట్రలోని పూణెలో విషాద ఘటన జరిగింది. వాఘోలిలోని సొలాసియా సొసైటీకి చెందిన సెప్టిక్​ ట్యాంక్​ను క్లీన్​ చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. అయితే ఊపిరి ఆడనందుకే వారు మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో 18 అడుగుల లోతు గల సెప్టిక్​ ట్యాంక్​లో ముగ్గురు కార్మికులు ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అప్పటికే ఇద్దరు కార్మికులు మృతిచెందగా, వారి మృతదేహాలను ఫైర్​ సిబ్బంది వెలికితీశారు. ఆ తర్వాత మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టి మూడో వ్యక్తి మృతదేహాన్ని కూడా బయటకుతీశారు. మృతి చెందిన వ్యక్తులను నితిన్​ ప్రభాకర్​ గోడ్​, గణేష్​ భలేరోతో పాటు సతీశ్​ కుమార్​ చౌదరీగా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details