Two Elders Murder Dragged Dead Body :స్వాతంత్ర్య దినోత్సవం రోజునే నడిరోడ్డుపై దారుణం జరిగింది. బిహార్‌లోని భాగల్‌పుర్‌లో ఇద్దరు వృద్ధులను అందరూ చూస్తుండగానే దారుణంగా హత్యచేశాడు ఓ యువకుడు. అనంతరం వారిలో ఒకరి మృతదేహాన్ని జాతీయ రహదారిపై దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన నడి రోడ్డుపై జరుగుతున్నా.. వీరిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
మహ్మద్ ఆజాద్ అనే వ్యక్తి ఇద్దరు వృద్ధులను దారుణంగా హత్యచేశాడు. ఇటుకలు, ఇనుప రాడ్లతో వారిపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు. దాదాపు అరగంట పాటు గొలుసులతో కట్టేసి కొట్టాడు. ఈ దాడిలో వృద్ధుడు అక్కడిక్కడే చనిపోగా.. వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అందులో ఒకరి మృతదేహాన్ని జాతీయ రహదారి 80పై దాదాపు 500 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఘటనా స్థలానికి తిరిగివచ్చి స్థానికులతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు నిందితుడు అజాద్‌ను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారు. యువకుడు కొన్ని రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చాలా రోజులుగా ఇంట్లోనే కట్టేసి ఉంచారు. అయితే మూడు రోజులు క్రితం ఇంట్లో నుంచి తప్పించుకుని వచ్చినట్లు తెలిపారు.
రాడ్లు, కర్రలతో దాడి చేసి..
బిహార్‌లోని గయాలో ఇద్దరు చిన్నారుల మధ్య వివాదం విధ్వంసానికి దారితీసింది. ఓ స్వీట్ వ్యాపారి కుటుంబంపై రాడ్లు, కర్రలతో దుండగులు దాడి చేశారు దుండగులు. అక్కడితో ఆగకుండా వారిపై వేడినూనెను పోశారు. అలాగే దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో బయటకి రావడం వల్ల అసలు విషయం బయటపడింది.