ఉత్తర్‌ప్రదేశ్ మహోబా జిల్లా అజ్నార్ స్టేషన్ పరిధిలోని మహౌబంద్ గ్రామంలో విషాదం జరిగింది. ఎనిమిది మంది కూలీలు 20 అడుగుల లోతులో బావి తవ్వుతుండగా.. వారిపై మట్టి, రాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మిగతావారు స్వల్ప గాయాలతో బయపడ్డారు.
బావి తవ్వుతుండగా ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ మహోబాలో బావి తవ్వుతుండగా పైనుంచి మట్టి, రాళ్లు పడి ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు కులపహాడ్ తహసీల్దార్ మహమ్మద్ ఉవైశ్ పేర్కొన్నారు.
బావి తవ్వుతుండగా మట్టి, రాళ్లు పడి ఇద్దరు మృతి
మృతులు రామ్‌సేవక్ అహిర్వార్(35), గ్యాసీలాల్(30)గా గుర్తించినట్లు కులపహాడ్ తహసీల్దార్ మహమ్మద్ ఉవైశ్ తెలిపారు. గాయపడ్డవారు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి :రూ.3 కోట్ల బీమా కోసం.. కారులోనే భర్తను కడతేర్చి