దిల్లీలో ఎన్కౌంటర్- ఇద్దరు క్రిమినల్స్ హతం - Khajuri Khas news
08:48 August 12
దిల్లీలో ఎన్కౌంటర్
దేశ రాజధానిలోని కంజూరి ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అమీర్‌ఖాన్, రాజ్‌మాన్ అనే ఇద్దరు నిందితులు మృతిచెందారు. కాల్పుల్లో పోలీస్ కానిస్టేబుల్స్ సచిన్, లలిత్ తోమర్ గాయపడ్డారు. నిందితుల నుంచి 2 తుపాకులు, 15 క్యాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు నేరస్థులు పలు హత్యలు, దోపిడీల్లో నిందితులుగా ఉన్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
కంజూరిఖాస్ ప్రాంతంలోని శ్రీరామ్ కాలనీలో నిందితులు ఉన్నట్లు తమకు విశ్వసనీయవర్గాల ద్వారా సమచారం వచ్చినట్లు పోలీసులు చెప్పారు. దీంతో వారిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లగా నిందితులు తమపై తుపాకీలతో కాల్పులు జరిపినట్లు వివరించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితులిద్దరూ మృతిచెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు.