జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదలు జరిపిన గ్రెనేడ్ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సోపోర్ బస్ స్టాండ్ దగ్గర ఉండే పోలీస్ చెక్ పోస్టుపై అల్ట్రాస్ గ్రెనేడ్ విసిరినట్లు పేర్కొన్నారు.
కశ్మీర్లో గ్రెనేడ్ దాడి- పోలీసులకు గాయాలు - గ్రెనేడ్ అటాక్ జమ్ముకాశ్మీర్
జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో భద్రతాబలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
భద్రతా దళాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి... పోలీసులకు గాయాలు
ఈ పేలుడులో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కానిస్టేబుల్ ఆజాద్ అహ్మద్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీఓ) మహ్మద్ అఫ్జల్ ఈ దాడిలో గాయపడినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:మంచు దారిలో.. గర్భిణీకి సైనికుల సాయం