జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి విఫలయత్నం చేశారు. అనంతనాగ్ జిల్లా బిజ్బెహరాలోని సంగం ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు పౌరులు స్వల్పంగా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రనేడ్ దాడి - జమ్ముకశ్మీర్‌లో గ్రెనేడ్ దాడి
జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్ల బంకర్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్‌తో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులకు స్వల్ప గాయాలయ్యాయి.
జమ్ముకశ్మీర్‌లో జవాన్లపై గ్రెనేడ్ దాడి
దాడికి యత్నించిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.
ఇదీ చదవండి:ఎన్నికల వేళ బంగాల్లో భారీగా నాటు బాంబులు