ఉత్తర్ప్రదేశ్లో రెండు కరోనా కప్పా రకం(Kappa Variant) కేసులు వెలుగుచూశాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
గత కొద్ది రోజులుగా కింగ్ జార్జ్ వైద్య కళాశాలలో 109 నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అందులో 107 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు కాగా.. రెండు కేసులు కప్పా వేరియంట్లుగా నిర్ధరణ అయినట్లు చెప్పారు.