Karnataka Accident: కర్ణాటక మండ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగమంగళ సమీపంలోని బెంగళూరు నుంచి మంగళూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వెళ్తున్న ఇన్నోవా, స్విఫ్ట్ కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవా కారులో ఉన్న కృష్ణమూర్తి (66), ఆయన భార్య జయంతి (60), డ్రైవర్ ప్రభాకర్‌ను మృతులుగా పోలీసులు గుర్తించారు. హసన్ నుంచి స్విఫ్ట్ కారులో వస్తున్న మరో ఇద్దరు మరణించినట్లు తెలిపారు. బిండిగనవిలే పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నారు.
రెండు కార్లు ఢీ.. ఐదుగురు దుర్మరణం.. టూరిస్ట్ బస్సు ప్రమాదంలో మరో 35 మంది.. - మండ్య రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
ఎదురెదురుగా వస్తున్న ఇన్నోవా, స్విఫ్ట్ కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరోవైపు, టూరిస్ట్ బస్సును లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకరు మరణించగా.. మరో 35 మంది గాయపడ్డారు.
టూరిస్ట్ బస్సును ఢీకొట్టిన లారీ..
టూరిస్ట్ బస్సును ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటన బిహార్‌లోని కైమూర్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా.. అందులో ఉన్న 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కుద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. టూరిస్ట్ బస్సు బంగాల్ నుంచి ఆగ్రాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు.
ప్రమాదానికి గురైన మినీ బస్సు..
కేరళ కోజికోడ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వడకర కుంజిపల్లి జాతీయ రహదారిపై పికప్ వ్యాన్‌ను అయ్యప్ప యాత్రికులతో వెళ్తున్న మినీబస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది యాత్రికులు, పికప్ వ్యాన్ డ్రైవర్ గాయపడ్డాడు. క్షతగాత్రులందరినీ కోజికోడ్‌లోని ఆస్పత్రికి తరలించారు. కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తులను క్షతగాత్రులుగా పోలీసులు గుర్తించారు.