మత్తుపదార్థాలు అక్రమ రవాణా చేసే ముఠా దుశ్చర్యకు పాల్పడింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై ముఠాలోని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. రాజస్థాన్లోని భీల్వాడా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు.
జిల్లాలోని కోట్డీ, రైకా పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు సిబ్బంది. ఈ క్రమంలో రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న స్మగ్లర్లు కాల్పులకు పాల్పడ్డారు.