Two Brothers Died In One Day: అన్నదమ్ములంటే ఒకరికొకరు తోడుగా ఉంటూ.. ఒకరికి కష్టం వస్తే మరొకరు తానున్నానే భరోసా ఇస్తుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఆస్తుల గొడవల్లో సోదరుడనే ప్రేమ భావం లేకుండా కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇప్పటికీ సోదరుడంటే ప్రాణం ఇస్తున్నారనడానికి ఈ విషాద ఘటనే నిదర్శనం. అన్న అకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన తమ్ముడు కుప్పకూలాడు. ఈ ఘటన పంజాబ్లోని భటిండాలో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే?.. పంజాబ్లోని భటిండా నగరానికి చెందిన ప్రీతమ్ సింగ్(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించి చికిత్స పొందుతూ ప్రీతమ్ సింగ్ మృతి చెందాడు. కుటుంబసభ్యులు.. ప్రీతమ్ సింగ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు.