himachal pradesh boys marriage: హిమాచల్‌ప్రదేశ్‌లో వింత వివాహం జరిగింది. ఉనా నగరంలో ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన అబ్బాయికి స్థానిక యువకుడు(24) తాళి కట్టాడు. ఆ రాష్ట్రంలో అబ్బాయిలు ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయం ఆనోటా ఈనోటా వెళ్లి.. పోలీసుల వద్దకు చేరింది. అయితే, దీనిపై ఏ విధంగా ముందుకెళ్లాలని పోలీసులు మదనపడుతున్నారు.
ఉనాకు చెందిన యువకుడు.. తన తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ఉత్తరాఖండ్ నుంచి ఓ యువకుడు వచ్చి వీరితో కలిశాడు. అయితే, వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి అనుమానించిన యువకుడి తమ్ముడు.. కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు.. ఈ విషయంపై గొడవ చేశారు. తమ కుమారుడికి ఓ యువతితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. వెంటనే యువకులు ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు.
ఏడాదిన్నర క్రితమే వివాహం:ఫేస్బుక్ ద్వారా యువకులిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే క్రమంగా ప్రేమగా మారింది. దీంతో ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. దిల్లీలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నట్లు యువకులు తెలిపారు. అనంతరం ఉనాకు చెందిన యువకుడు తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఉత్తరాఖండ్ యువకుడు.. హిమాచల్‌లోని ఉనాకు చేరుకున్నాడు.