ఉత్తరాఖండ్ చమోలీ ప్రమాదంలో ఆదివారం మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది. మృతుల్లో ఒకరు తెహ్రీ జిల్లా నరేంద్ర నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఇంకా 163 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలిపారు.
జల విలయం: మరో మూడు మృతదేహాలు లభ్యం - ఉత్తరాఖండ్ జల ప్రళయం
ఉత్తరాఖండ్ ఘటనలో తపోవన్ సొరంగంలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో చిక్కుకున్న 30 మంది కోసం ఏడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా లభించిన మృతదేహాలతో మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది.
ఉత్తరాఖండ్ చమోలీ ప్రమాదం
ఆచూకీ గల్లంతైన వారిని రక్షించే చర్యల్లో భాగంగా తపోవన్ సొరంగానికి రంధ్రం చేశారు అధికారులు. బురదతో నిండిపోయిన సొరంగంలో 30 మందికిపైగా చిక్కుకుని ఉంటారని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. అయితే అందులో మనుషులు ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు కెమెరాలను పంపాలని నిర్ణయించారు. దీని కోసం మరింత పెద్ద రంధ్రం చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:ఆపరేషన్ తపోవన్: సొరంగానికి రంధ్రం
Last Updated : Feb 14, 2021, 11:48 AM IST