లఖింపుర్ కేసులో (Lakhimpur Kheri News) ఇద్దరు నిందితులను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బన్బీర్పుర్కు చెందిన లవ్‌కుశ్, నీఘాసన్కు చెందిన ఆశిశ్ పాండేలుగా గుర్తించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి కూడా సమన్లు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తన ముందు హాజరు కావాలని పేర్కొన్నారు.
ఇదీ జరిగింది..
నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ.. అక్టోబర్ 3న లఖింపుర్ ఖేరిలో (Lakhimpur Kheri Incident) ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు చనిపోవడం.. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో ఆశిష్ మిశ్రా సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ప్రశ్నించేందుకు పిలిచారు.
ఇదీ చూడండి :నక్సలైట్లు, ఉగ్రవాదులతో పోరుకు 92 మంది మహిళలు సై!