జమ్ము- కశ్మీర్లోని సియాచిన్లో ఆదివారం మధ్యాహ్నం హిమపాతంలో చిక్కుకుని ఇద్దరు సైనికులు మృతి చెందారు. వీరిని సాయంత్రం 7 గంటలకు వెలికి తీయగా.. అప్పటికే తీవ్రగాయాలతో చనిపోయారని సైనిక వర్గాలు తెలిపాయి.
సియాచిన్లో ఇద్దరు సైనికులు మృతి - Siachen
జమ్ము- కశ్మీర్లోని సియాచిన్లో హిమపాతంలో చిక్కుకుని ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. వీరిని సాయంత్రం 7 గంటలకు వెలికి తీయగా.. అప్పటికే తీవ్రగాయాలతో చనిపోయారని సైనిక వర్గాలు తెలిపాయి.
సియాచిన్
హిమాయాల్లోని కారకోరం పర్వత శ్రేణుల్లో దాదాపు 20వేల అడుగుల ఎత్తున్న సియాచిన్లో భారీ హిమపాతాలు, మంచుచరియలు విరిగిపడటం సహజం. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీలకు పడిపోతుంటాయి.
ఇదీ చదవండి :భయం వద్దు: 90శాతం రోగులకు ఇంటివద్దే నయం!