తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జవాన్ల 'గూఢచర్యం'- ఐఎస్​ఐ చేతికి ఆర్మీ సమాచారం - పాకిస్థాన్‌

సైన్యంలో ఉంటూ గూఢచర్యానికి పాల్పడిన ఇద్దరు జవాన్లను అరెస్టు చేశారు పంజాబ్ పోలీసులు. పాకిస్థాన్​కు చెందిన ఐఎస్​ఐకి ఆర్మీ రహస్యాలను వారు చేరవేసినట్లు అధికారులు తెలిపారు.

Army jawans arrested
గూఢచర్యం

By

Published : Jul 6, 2021, 10:58 PM IST

గూఢచర్యానికి పాల్పడుతూ.. కీలక సమాచారం పాకిస్థాన్‌ నిఘా సంస్థ-ఐఎస్​ఐకి చేరవేస్తున్న ఇద్దరు సైనికులను పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను హర్ ప్రీత్ సింగ్, గుర్ భేజ్ సింగ్​గా గుర్తించారు.

ఇద్దరిలో ఒకరు అనంతనాగ్​లోని 19వ రాష్ట్రీయ రైఫిల్స్, మరొకరు కార్గిల్​లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి సైనికుల విధులు, మోహరింపునకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో నిందితులు 900 దస్త్రాలను.. ఓ డ్రగ్ స్మగ్లర్​కు అందజేశారని, అతడి నుంచి అవి ఐఎస్​ఐకి అందినట్లు పంజాబ్‌ పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి:ఇస్రో గూఢచర్యం కేసు: పోలీసులపై సీబీఐ ఎఫ్​ఐఆర్​

ABOUT THE AUTHOR

...view details