కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది. చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. కరోనా కారణంగానే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను మరో వారంలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు జూన్ 7న కేంద్రానికి లేఖ రాసినట్లు ట్విట్టర్ వర్గాలు బుధవారం వెల్లడించాయి.
ఇప్పటికే నోడల్, గ్రీవెన్స్ అధికారులను నియమించినట్లు ట్విట్టర్ వెల్లడించింది. కేంద్రంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగుతాయని.. భారత్‌లో సేవలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ట్విట్టర్ వెల్లడించింది.