కేంద్రం నుంచి ఇప్పటికే ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న ట్విట్టర్ మరోమారు వార్తల్లో నిలిచింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతా(M Venkaiah Naidu twitter)కు తొలుత బ్లూ బ్యాడ్జ్‌ను తొలగించిన సామాజిక మాధ్యమ దిగ్గజం... కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది. కానీ అప్పటికే ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిపోయింది.
కారణమేంటి?
ప్రముఖుల, ప్రజా ప్రయోజనాలు ఉన్న ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈ బ్లూ టిక్‌ను ఇస్తుంది ట్విట్టర్(Twitter). అయితే వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకు దీనిని తొలగించింది. శనివారం ఉదయం నుంచి ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.