భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ట్విట్టర్.. ఆ మ్యాప్‌ను తొలగించింది. ట్వీప్ లైఫ్ సెక్షన్లో ట్విట్టర్.. సోమవారం సాయంత్రం జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ మ్యాప్‌ను పోస్ట్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. ట్విట్టర్ బ్యాన్ పేరుతో నెటిజన్లు ఈ చర్యపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ మ్యాప్‌ను సోమవారం రాత్రి తొలగించింది. ఈ చర్యలపై ట్విట్టర్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.
ట్విట్టర్ వైఖరిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మ్యాప్ ట్విట్టర్ అధికారిక వెబ్సైట్లోనే ఉంటడం వల్ల దీనికి ఆ సంస్థే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపటం ట్విట్టర్‌కు ఇది తొలిసారి కాదు. గతేడాది కూడా లేహ్ ప్రాంతాన్ని చైనా మ్యాప్‌లో చూపించి విమర్శలను మూటగట్టుకుంది. ఆ సమయంలో ట్విట్టర్‌కు ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.