మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్‌పై దిల్లీలో కేసు నమోదైంది. తప్పుడు సమాచారం అందించడం సహా పోక్సో చట్టాన్ని ఉల్లంఘించినందుకు జాతీయ బాలల హక్కుల కమిషన్ ఈ ఫిర్యాదు చేసింది. ఓ దర్యాప్తు విషయంలో కమిషన్‌ను తప్పుదోవ పట్టించినట్లు పిటిషన్లో పేర్కొంది.
పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 15, 19ని ట్విట్టర్ సంస్థ ఉల్లంఘించిందని కమిషన్ ఆరోపించింది. ఐపీసీ సెక్షన్ 199ని సైతం ఉల్లంఘించిందని పేర్కొంది.