తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ టూల్​కిట్ వ్యవహారంపై స్పందించిన ట్విట్టర్

కాంగ్రెస్​ టూల్​కిట్​ రగడలో ట్విట్టర్​ జోక్యం చేసుకుంది. భాజపా నేత సంబిత్​ పాత్రా చేసిన ట్వీట్లు అవాస్తవం అని పేర్కొంది. అవాస్తవమైన వీడియోలు, ఆడియోలు, ఫొటోలను ట్విట్​ చేస్తే చర్యలు చేపడతామని ట్విట్టర్​ స్పష్టం చేసింది.

కాంగ్రెస్​ టూల్​కిట్​, congress toolkit twitter
ట్విట్టర్

By

Published : May 21, 2021, 12:01 PM IST

Updated : May 21, 2021, 2:46 PM IST

ఇటీవల కాంగ్రెస్​ టూల్​కిట్​ పేరుతో భాజపా నేత సంబిత్​ పాత్రా ట్విట్టర్​లో చేసిన వివాదాస్పద ట్వీట్లు అవాస్తవమైనవని ట్విట్టర్​ తెలిపింది. ఈ మేరకు సంబంధిత ట్వీట్లను మేనిప్యులేటెడ్​ మీడియాగా పేర్కొంది. భాజపా నేతల ట్విట్టర్​ ఖాతాలు శాశ్వతంగా తొలగించాలంటూ కాంగ్రెస్​ గురువారం ట్విట్టర్​కు లేఖ రాసిన నేపథ్యంలో ఆ సంస్థ ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అవాస్తవమైన వీడియోలు, ఆడియోలు, ఫొటోలు ట్విట్​ చేస్తే ఈ తరహా చర్యలు చేపడతామని ట్విట్టర్​ స్పష్టం చేసింది.

భాజపా నేతలు చేసిన ట్వీట్లను తప్పుపడుతూ కాంగ్రెస్​ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఛత్తీస్​గఢ్​ పోలీసులు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చదవండి :మహారాష్ట్రలో ఎన్​కౌంటర్​- 13 మంది మావోలు హతం

Last Updated : May 21, 2021, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details