తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా నేతకు ట్విట్టర్ షాక్- తొలిసారి ఇలా... - అమిత్ మాలవీయ ట్వీట్​కు ట్విట్టర్ షాక్

భాజపా ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాలవీయ ట్వీట్​కు 'మ్యానిప్యులేటెడ్' లేబుల్ జత చేసింది ట్విట్టర్. రైతులపై పోలీసులు లాఠీ ఎత్తిన ఫొటోకు సంబంధించి మాలవీయ చేసిన ఫ్యాక్ట్-చెక్ ట్వీట్​ను 'ఫ్లాగ్' చేసింది.

Twitter labels Amit Malviya's farmer video 'manipulated media'
భాజపా నేత మాలవీయ ట్వీట్​కు ట్విట్టర్ షాక్

By

Published : Dec 2, 2020, 5:38 PM IST

దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతుపై ఓ పోలీసు లాఠీ ఎత్తిన వీడియోను పోస్ట్​ చేసిన భాజపా ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాలవీయకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన ట్వీట్​కు 'మ్యానిప్యులేటెడ్(తారుమారు చేసిన) మీడియా' లేబుల్​ను జత చేసింది.

ఏం జరిగిందంటే?

సింఘు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వృద్ధ రైతుపై పోలీసు లాఠీ ఎత్తాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

రైతుపై లాఠీ ఎత్తిన పోలీసు

ఈ ఫొటోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్​లో పోస్ట్ చేస్తూ.. ప్రధాని మోదీ అహంకారం వల్ల రైతులకు జవాన్లు వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాహుల్ ట్వీట్​కు నవంబర్ 28న మాలవీయ స్పందించారు. లాఠీ ఎత్తిన ఫొటోకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. పోలీసు లాఠీ రైతుకు అసలు తగలలేదని అన్నారు.

అయితే రైతులను పారామిలిటరీ దళాలు లాఠీతో కొట్టిన పలు వీడియోలు ట్విట్టర్​లో వైరల్ అయ్యాయి. మాలవీయ మాత్రం.. రైతులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయలేదంటూ.. కొన్ని సెకన్ల వీడియోనే తన ట్వీట్​లో చూపించారు.

నిబంధనల ప్రకారం.. కల్పితమైన, మోసపూరితంగా మార్చిన కంటెంట్​కు ట్విట్టర్ రెడ్ ఫ్లాగ్ జత చేస్తుంది. మోసపూరిత పద్ధతిలో షేర్ చేసిన లేదా, ప్రజా భద్రతకు భంగం కలిగించేదిగా ఉన్న పోస్టులకు ఈ విధమైన లేబుళ్లను జత చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details