భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పేరుతో ట్విట్టర్లో నకిలీ ఖాతాను తెరిచారు కొందరు వ్యక్తులు. తన పేరిట ఈ ఖాతాను తెరిచి, వివిధ అంశాలపై ఇందులో పోస్టులు పెట్టడం సోమవారం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ట్విట్టర్‌కు ఫిర్యాదు చేయగా.. వెంటనే దాన్ని తొలగించారు.
జస్టిస్ ఎన్.వి. రమణ పేరిట ట్విట్టర్లో నకిలీ ఖాతా
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ట్విట్టర్లో నకిలీ ఖాతాను తెరిచారు. అయితే ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఖాతాను తొలగించింది ట్విట్టర్. ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీజేఐ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జస్టిస్ ఎన్.వి. రమణ
ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీజేఐ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి :'ఆ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయండి'