రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు కర్ణాటకలోని తుమకూరు సమీపంలో సంచలనం సృష్టించిన కండోమ్‌ల కేసు (Tumkur condom case) సరికొత్త మలుపు తిరిగింది. దర్యాప్తులో భాగంగా స్థానిక లాడ్జిలో సోదాలు నిర్వహించిన పోలీసులు.. విస్తుపోయే విషయాలు బయటపెట్టారు. లాడ్జిలో ఓ భారీ సొరంగాన్ని గుర్తించారు. ఈ సొరంగాన్ని వ్యభిచార కూపంగా వాడుకుంటున్నట్లు తెలిపారు. కండోమ్‌లు ఇక్కడి నుంచి వచ్చినవిగా భావిస్తున్నట్లు చెప్పారు.
సొరంగంలో దాగి ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. వీరిలో ఇద్దరు మహిళలతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి ఉన్నట్లు వివరించారు. సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్లు తేలినందున లాడ్జిని తాత్కాలికంగా మూసివేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
గతకొన్నిరోజుల క్రితం తుమకూరు సమీపంలోని 48వ జాతీయ రహదారి వద్ద ఉన్న (Condoms on highway) ఫ్లైఓవర్‌పై పెద్ద ఎత్తున్న కండోమ్‌లు బయటపడడం సంచలనం సృష్టించింది. దీనిపై స్థానికులు, పాదచారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసుపై తుమకూరు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి.. దర్యాప్తు చేపట్టారు. ఒడనాడి సేవా ట్రస్ట్ సహకారంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా లాడ్జిలో సోదాలు నిర్వహించగా.... వ్యభిచార రాకెట్ వెలుగులోకి వచ్చింది. కండోమ్‌ల కేసులో ఇప్పటివరకు ఐదుగురిని తుమకూరు పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:'విజయవాడ డ్రగ్స్ విలువ రూ.9 వేల కోట్లు కాదు.. 15వేల కోట్లు!'