తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరు నెలల కవలలు మృతి.. వంట చేస్తుంటే ఉయ్యాలకు మంటలు... - కవలలు సజీవదహనం

గుడిసెకు నిప్పు అంటుకుని.. ముక్కుపచ్చలారని కవలలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో చిన్నారులు ఉయ్యాలలో నిద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన రాజస్థాన్​లో జరిగింది.

twins
అగ్నిప్రమాదం

By

Published : Nov 10, 2021, 3:50 PM IST

ప్రమాదవశాత్తు ఓ గుడిసెలో జరిగిన అగ్నిప్రమాదానికి ముక్కుపచ్చలారని కవలలు బలయ్యారు. ఉయ్యాలలో నిద్రపోతూనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో ఈ విషాదం జరిగింది.

ఏం జరిగిందంటే..?

ఉదయ్​పుర్ జిల్లా కోట్​ఢా పోలీస్ స్టేషన్ పరిధిలోని జంబువా ఫలా గ్రామానికి చెందిన ఉజ్మా అనే వ్యక్తికి భార్య, ఆరు నెలల కవలలు ఉన్నారు. అయితే మంగళవారం చిన్నారులను ఉయ్యాలలో నిద్రపుచ్చి తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయారు. దీంతో మంటలు పొయ్యి నుంచి వారు నివసిస్తున్న గుడిసెకు అంటుకున్నాయి.

అగ్నిప్రమాదంలో మృతిచెందిన చిన్నారులు

చిన్నారుల ఏడుపు విన్న తల్లిదండ్రులు, గ్రామస్థులు, వెంటనే అక్కడకు చేరుకుని.. అతికష్టం మీద వారిని బయటకు తీసుకొచ్చారు. కవలలను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఉదయ్​పుర్​కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. చేసేదేంలేక.. చిన్నారులను ఉదయ్​పుర్​కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే వాళ్లు మృతిచెందారు.

సమాచారం అందిన వెంటనే కోట్​ఢా స్టేషన్​ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పొయ్యిలోంచి ఎగిసిన మంటల కారణంగానే గుడిసెకు నిప్పంటుకున్నట్లు నిర్ధరించారు.

ఇదీ చూడండి:ట్రక్కు, బస్సు ఢీ- 11 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details