Male Pillion Riders on Two-wheelers Banned: ద్విచక్ర వాహనంపై వెనుక సీటులో (పిలియన్ రైడర్) పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు కేరళలోని పాలక్కడ్ అదనపు కలెక్టర్. ఓ ఆర్ఎస్ఎస్ వర్కర్‌ను ఎస్డీపీఐ కార్యకర్త హత్య చేసినట్లు భావిస్తున్న కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ షాప్‌కు టూవీలర్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి.. పట్టపగలే అతడిని హత్య చేశారు. ఏప్రిల్ 15న ఎస్డీపీఐ కార్యకర్త సుబెయిర్ హత్యకు ప్రతీకారంగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. 24 గంటల వ్యవధిలో జంట హత్యలు జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.