తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో జంట పేలుళ్లు.. ఏడుగురికి గాయాలు​ - జమ్ముకశ్మీర్​ నర్వాల్​ జంట పేలుళ్లు

జమ్ముకశ్మీర్​లో జంట పేలుళ్లు కలకలం సృష్టించాయి. 15 నిమిషాల్లో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో ఏడుగురు గాయపడ్డారు. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని గాలిస్తున్నాయి.

twin blasts occurred in Narwal area of Jammu kashmir
twin blasts occurred in Narwal area of Jammu kashmir

By

Published : Jan 21, 2023, 12:23 PM IST

Updated : Jan 21, 2023, 2:20 PM IST

జమ్ముకశ్మీర్​లో జంట పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ పేలుళ్లు 15 నిమిషాల వ్యవధిలో జమ్ము నగరంలోని నర్వాల్​ ప్రాంతంలో సంభవించాయి. మొదటి పేలుడులో ఐదుగురు.. రెండో పేలుడులో మరో ఇద్దరికి గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం​ ఘటనాస్థలికి చేరుకున్నాయని జమ్ము ఏడీజీపీ ముకేశ్​ సింగ్​ తెలిపారు.

కాగా, ఆస్పత్రికి తరలించిన క్షతగాత్రులకు స్వల్పగాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పుడు వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఈ పేలుళ్లు నర్వాల్​ ప్రాంతంలోని ఓ ట్రాన్స్​పోర్టు యార్డులో సంభవించాయి. రిపేర్​ కోసం వర్క్​షాపునకు తీసుకువచ్చిన ఓ వాహనంలో మొదటి పేలుడు ఉదయం 10.45 గంటలకు జరిగిందని ప్రత్యక్ష సాక్షి, మోటార్​ స్పేర్​ పార్ట్స్​ అసోషియేషన్​ అధ్యక్షుడు జస్విందర్​ సింగ్​ అనే వ్యక్తి తెలిపారు. దానికి సమీపంలోనే 15 నిమిషాల వ్యవధిలో మరో పేలుడు జరిగిందని తెలిపారు. ఉగ్రదాడుల అనుమానాలు, జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర సాగుతుండడం, గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుగనున్న తరుణంలో భద్రతా దళాలు అలర్ట్​ అయ్యాయి.

జమ్ముకశ్మీర్​లో జంట పేలుళ్లు
Last Updated : Jan 21, 2023, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details