తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిడుగుపాటుకు 40 మంది బలి.. పశువుల్ని మేపుతూ అక్కడికక్కడే..! - పిడుగులు

మంగళవారం ఒక్కరోజే పిడుగుపాటుకు 20 మంది మరణించిన ఘటన బిహార్​లో జరిగింది. 8 జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. యూపీలో రెండు రోజుల వ్యవధిలో 18 మంది చనిపోయారు. ఝార్ఖండ్​లోనూ పిడుగుపాటుతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Twenty killed in lightning strikes in Bihar, 18 killed in UP
Twenty killed in lightning strikes in Bihar, 18 killed in UP

By

Published : Jul 27, 2022, 8:30 AM IST

Bihar Lightning Strike: బిహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒక్కరోజే 8 జిల్లాల్లో ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క కైమూర్‌ జిల్లాలోనే అత్యధికంగా ఏడుగురు మరణించగా.. భోజ్‌పుర్‌, పట్నాలో నలుగురు చొప్పున, జహనాబాద్‌, అర్వాల్‌, రోహ్తాష్‌, సివాన్‌, ఔరంగాబాద్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత రెండు రోజుల్లో పిడుగుపాటుకు గురై మొత్తం 18 మంది మృతి చెందారు. ఒక్క మంగళవారం రోజే 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. కౌశాంబిలో ఏడుగురు, ప్రయాగ్‌రాజ్‌లో అయిదుగురు, ఘాజీపూర్‌లో నలుగురు, భదోహిలో ఇద్దరు మరణించినట్లు చెప్పారు.
ఝార్ఖండ్​ పలామూలోనూ ఇద్దరు పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. పొలంలో పశువులను మేపుతుండగా.. పిడుగులు సంభవించి బల్​రాం యాదవ్​(56), మాన్మతి దేవి(45) అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details